Mar 04,2023 21:46

ఫొటో : ప్రచారం చేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

పోరాడే వ్యక్తులను గెలిపించుకొందాం..
ప్రజాశక్తి-ఉదయగిరి : ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ సమస్యలపై నిరంతరం పోరాడే పిడిఎఫ్‌ అభ్యర్థులను గెలిపించుకొందామని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీ మంగళకట్ట సినిమాలు సెంటర్‌ సింగనపల్లి వీధిలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ నిర్మూలన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూ నిర్భయంగా సమస్యలపై గల విప్పే పిడిఎఫ్‌ ఎంఎల్‌సి పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్లురెడ్డి, ఉపాధ్యాయ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డిలను మొదటి ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కాకు.వెంకటయ్య, గడ్డం నాగేశ్వరరావు పాల్గొన్నారు.