Mar 10,2023 22:03

ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కనగాన పల్లి : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా తహశీల్దార్‌ రమణ, ఎస్‌ఐ హనుమంతరెడ్డితో ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
ఓబులదేవరచెరువు : ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను డీఎస్పీ యశ్వరత్‌, ఎస్‌ఐ గోపీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నంబుల పూలకుంట : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్‌ కేంద్రాన్ని ఆర్డీవో రాఘవేంద్ర తనిఖీ చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్దమౌలికవసతులు పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ రవినాయక్‌, ఎస్‌ఐ సద్గురుడు తదితరులు పాల్గొన్నారు