Mar 13,2023 22:05

చిలమత్తూరు పోలింగ్‌కేంద్రం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌

చిలమత్తూరు : మండల కేంద్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం 213ను సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌ పరిశీలించారు. పిడిఎఫ్‌ అభ్యర్ధి పోతుల నాగరాజు తరపున ఉన్న ఎజెంట్లు, సిపిఎం, సిఐటియు, ప్రజా సంఘాల నాయకులతో ఎన్నికలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రవీణ్‌, వెంకటేష్‌, లక్ష్మినారాయణ, రామచంద్ర, గోవిందు తదితరులు పాల్గొన్నారు.