Mar 12,2023 21:36

పోలింగ్‌ కేంద్రాలలో పరిశీలిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి -నెల్లూరు :రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నెల్లూరు పార్లమెంట్‌ టిడిపి అద్యక్షులు, రూరల్‌ నియోజకవర్గ ఇంచార్జి అబ్దుల్‌ అజీజ్‌, జాతీయ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యులు గుంటుపల్లి నాగేశ్వర రావు లు స్థానిక టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నీ పోలింగ్‌ కేంద్రాల్లో ప్రభుత్వం వారు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డికె మహిళా కళాశాలలో కలెక్టర్‌ చక్రధర్‌ బాబు ను కలిసి కొన్ని అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో నకిలీ ఓటర్లు రావటం సహజమని, ఈ ఎన్నికల్లో పదవ తరగతి కూడా చదవని వారు ఒక ప్రణాళిక ప్రకారం పట్టభద్రుల వలే దొంగ ఓటు నమోదు చేసుకున్నారని కలెక్టర్‌ కు తెలిపారు. అలా గుర్తించిన ఓటర్ల వివరాలు కలెక్టర్‌కు అందజేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసు కోవాలని కోరారు .అనంతరం మీడియా తో మాట్లాడుతూ, పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోవాలని, ఓటు శాతం పెరిగితే మార్పులు ఎలా ఉంటాయో తామే చూడాలని పిలుపునిచ్చారు. టిడిపి అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, రాజా నాయుడు, పెంచల్‌ నాయుడు, సాబీర్‌ ఖాన్‌, కంటే సాయి, కనపర్తి గంగాధర్‌, బాలకృష్ణ చౌదరీ పాల్గొన్నారు