అమరావతి : పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం ఉద్యమాలను ఆపలేరని సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సిఎం జగన్.. జాబ్ లెస్ క్యాలెండర్ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సిఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల్లో 30 శాతం ఖాళీలు ఉన్నాయని ఆర్ధిక శాఖ ప్రకటించిందని తెలిపారు. సోమవారం సిఎం ఇంటి ముట్టడికి సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.










