Mar 26,2023 22:03
ఫొటో : పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌

పోలీసులకు ఉచిత వైద్య పరీక్షలు
- డాక్టర్‌ కెవి శ్రావణ్‌ కుమార్‌
ప్రజాశక్తి-ఆత్మకూరు : పోలీసుల ఆరోగ్య భద్రత కోసం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అభిరామ్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. ఇటీవల ఆత్మకూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ గుండెపోటు రావడం అది కూడా వైద్య చికిత్సకు అవకాశం లేనివిధంగా క్షణాలలో ప్రాణం కోల్పోవడం చాలా బాధాకరమని అభిరామ్‌ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, ఎస్‌ఐ శివశంకర్‌రావులు అన్నారు. ఆదివారం డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ సిబ్బందికి ఆయన గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ముఖ్యంగా 50ఏళ్ల లోపు వాళ్లే గుండెపోటు వచ్చి చనిపోతున్న నేపథ్యంలో అన్ని మెగా హెల్త్‌ చెకప్‌లు లేకపోయినా కొన్ని బేసిక్‌ చెకప్‌లు చాలా అవసరం ప్రతి వ్యక్తి జీవితంలో ఏడాదికి ఒకసారి అయిన పరీక్షలు చేసుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.
బిపి, సుగర్‌ ఉన్నవారు హెల్త్‌ చెకప్‌ చేసుకుంటూ వాటిని కంట్రోల్‌ చేసుకోవాలని ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నడక, యోగా, ప్రాణాయం, చేయడంతో స్ట్రెస్‌ నుండి బయటపడవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి సమయానికి ఆహారం తీసుకోవడం వైద్య పరీక్షలు నిర్వహించుకోవడంతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఎస్‌ఐ శివశంకరరావు మాట్లాడుతూ సిఐ నాగేశ్వరరావు మరణం ఎంతో బాధకు లోనైయ్యామని తెలిపారు. ఎస్‌పి విజయరావు పోలీసు సిబ్బంది ఆరోగ్యం సంక్షేమం దృష్ట్యా ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే సకాలంలో వ్యాధిని గుర్తించి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆత్మకూరు డివిజన్‌ పరిధిలో 11 పోలీస్‌ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ కూడా గుండె సంబంధించిన వైద్య పరీక్షలు కొలెస్ట్రాల్‌ చికిత్సలు అన్నీ కూడా చేయాలన్నారు. ఈ మేరకు ఆత్మకూరు డిఎస్‌పి కోటారెడ్డి ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి అభిరామ్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డి.ఎస్‌.పి కోటారెడ్డి అభిరామ్‌ ఆసుపత్రి అధినేత డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ను అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో పోలీసుల సంక్షేమ దృష్ట్యా లక్ష రూపాయలుపైన విలువైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా ఆత్మకూరు తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు.