ప్రజాశక్తి-విజయవాడ: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 21న జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను అడిషనల్ డిజి డాక్టర్ శంకఖబ్రాత బాగ్చి, ఎన్‌టిఆర్ జిల్లా పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా బుధవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వివిఐపిలు, విఐపిలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రత, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పోలీస్ పరేడ్‌ను పర్యవేక్షించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ డి.మేరీ ప్రశాంతి, ఎస్‌బి ఎడిసిపి సి.హెచ్.లక్ష్మీపతి, సెంట్రల్ ఎసిపి ఖాదర్ బాషా, సిఎఆర్ ఎసిపి చెంచి రెడ్డి పాల్గొన్నారు.










