Dec 28,2022 19:44

సిబ్బందితో మాట్లాడుతున్న డిఐజి

ప్రజాశక్తి -పొదలకూరు : పొదలకూరు పోలీస్‌ స్టేషన్‌ ను గుంటూరు రేంజ్‌ డిఐజి త్రివిక్రమ్‌ వర్మ బుధవారం తనిఖీ చేశారు. తొలుత ఆయన స్టేషన్‌ ఆవరణంలో ఉన్న వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్టేషన్‌ లోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిధిలోని ఐదు జిల్లాల్లో తనిఖీలను దాదాపు పూర్తి చేశామన్నారు. గత విజిట్‌ నెల్లూరు డిఎస్‌పి ఆఫీసులో చేసినట్లు చెప్పారు. పెండింగ్‌ కేసులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు నుంచి క్రైమ్‌ రేటు స్టాటిస్టిక్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి నేరాల నివారణకు తగు సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో క్రైమ్‌ రేటు అదుపు లో ఉందన్నారు. రౌడీ షీటర్ల పై జిల్లా ఎస్పీ ప్రత్యేక దష్టి పెట్టారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విజయరావు తదితరులు పాల్గొన్నారు.