Feb 21,2023 22:08

రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ

కొత్తచెరువు : జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ సాధారణ తనిఖీలో భాగంగా పుట్టపర్తి సబ్‌ డివిజన్‌ పరిదిలో లోని కొత్తచెరువు పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్‌ రోస్టర్‌, వివిధ క్రైమ్‌ రికార్డులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను, స్టేషన్‌ లో సీజ్‌ చేయబడిన వాహనాలను, లాకప్‌ గదులను,కంప్యూటర్‌ గదిని పరిశీలించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని, స్టేషన్‌ పరిధిలో అక్రమ రవాణా పై నిఘా పెంచాలని, చోరీ కేసులలో రికవరీ పెంచాలని సూచించారు. స్టేషన్‌ పరిధిలో జరిగే రెగ్యులర్‌ క్రైమ్‌ పై ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యశ్వంత్‌, సిఐ జయనాయక్‌, ఎస్‌ఐ లింగన్న , పోలీసులు తదితరులు పాల్గొన్నారు.