మాట్లాడుతున్న కార్యకర్తలు
మాట్లాడుతున్న కార్యకర్తలు
పోలేరమ్మ ఉత్సవానికి చాటింపు
ప్రజాశక్తి-అల్లూరు:పటలో వెలసియున్న శ్రీ పోలేరమ్మ ఉత్సవానికి మంగళవారం ఊరు పెద్దల సమక్షంలో 2వ చాటింపును వేశారు. అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆచారాల నడుమ సాంప్రదాయ బద్దంగా గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మలకు వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ ఉత్సవాలు నిర్వహించేందుకు ఊరు పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు భక్తులను అలరించేందుకు పలు సాంస్కతిక కార్యక్రమాలు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఒకేసారి ఊరేగింపు చేసి కొలువుతీరిన వారి ఆలయాలకు భాజా భజంత్రీలతో సాగనంపుతారు.










