Jan 10,2023 21:26

ఫొటో : అమ్మవారి సేవలో మంత్రి, ఎంపి, ఎంఎల్‌ఎ

పోలేరమ్మ సేవలో మంత్రి, ఎంపి, ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి-అల్లూరు : మండల కేంద్రం స్థానిక పేటలో ఏర్పాటుచేసిన పోలేరమ్మ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కావలి మాజీ ఎఎంసి చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేశారు. ప
లువురు మహిళలు పోలేరమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన సద్ది నివేదన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో పలు సాంస్కృతి కార్యక్రమాలు అలాగే వైసిపి ఆఫీస్‌ వద్ద ట్రాలీ ఏర్పాటు చేశారు.