పొగాకు వేలం కేంద్రంలో పరిశీలిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -కందుకూరు :పొగాకు బోర్డు సెక్రటరీ ఇన్‌ఛార్జి మేనేజర్ ఆక్షన్ దివి వేణుగోపాల్, ఎం లక్ష్మణ రావు రీజనల్ మేనేజర్ కందుకూరు 26, 27 వేలం కేంద్రాలను బుధవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పొగాకు వేలాన్ని పరిశీలించారు. రైతులు జరుగుతున్న మార్కెట్‌కు అనుగుణంగా బేళ్లు విక్రయించుకోవాలని సూచించారు. రాబోయే పంట కాలానికి పచ్చి రొట్ట ఎరువులను విధిగా వాడాలని సూచించారు. వేలం కేంద్రం ఆవరణలో మొక్కలు పెంచాలని నిర్వాహకులకు సూచించారు.










