May 31,2023 22:00

ఫొటో : అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది

పొగాకు ఉత్పత్తులకు నివారించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని డాక్టర్‌ అనూష డాక్టర్‌ సల్మాలు అన్నారు. బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మహిమలూరు పిహెచ్‌సి డాక్టర్‌ అనూష, ఆత్మకూరు అర్బన్‌ పిహెచ్‌సి డాక్టర్‌ అస్మాలు ఆరోగ్య సిబ్బందితో కలసి ఆత్మకూరు బస్టాండ్‌ నుండి సోమశిల రోడ్డు వరకు పొగాకును వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అర్బన్‌ పిహెచ్‌సిలో మీటింగ్‌ ఏర్పాటు చేసి పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి తెలియజేశారు.
పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికంగా ఉంటాయని పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయని గొంతు కేన్సర్‌, నోటి కేన్సర్‌, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని కావున పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌.సుధాకర్‌, మల్లెం కొండయ్య, శైలజ, ఎస్‌డి రషీద్‌, యు.లలితమ్మ, ఎఎన్‌ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.