మాట్లాడుతున్న వేలం నిర్వహణాధికారి చైన్ రామ్ మీనా
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు 26వేలం కేంద్రంలోని పరిధిలోని దూబగుంట, వెంపాడు గ్రామాల్లో పొగాకు పంట నియంత్రణపై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. వేలం నిర్వహణ అధికారి చైన్ రామ్ మీనా మాట్లాడుతూ పొగాకు బోర్డు అనుమతి మేరకే తేలిక పాటి నేలలకు బ్యారన్‌కు 2.90 హెక్టార్ల వరకే పొగాకు సాగు చేయాలన్నారు. బ్యారన్‌ఖు 3650 కిలోల పొగాకు మాత్రమే పండించాలని సూచించారు. పోగాకు బోర్డు అనుమతి లేకుండా కొత్త బ్యారన్ లు కట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐటీసీ మనేజర్ ప్రవీణ్ బాబు మాట్లాడుతూ ప్రతి రైతు పచ్చి రొట్ట ఎరువులు వేసి దిగుబడి పెంచుకోవచ్చు అని సూచించారు. ఫీల్డ్ ఆఫీసర్ ఉపేంద్ర మాట్లాడారు. పొగాకు బోర్డు సిబ్బంది, పొగాకు రైతులు పాల్గొన్నారు.










