పనులు పరిశీలిస్తున్న కలెక్టర్ గిరీష
ప్రజాశక్తి - రాయచోటి : గెస్ట్ హౌస్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ గిరీషా పిఎస్ ఆదేశించారు. శనివారం రాయచోటి సాయి ఇన్‌స్టిట్యూట్ ఎదురుగా నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ నిర్మాణం పనులను శనివారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. గెస్ట్ హౌస్ వచ్చేందుకు చురుగ్గా జరుగుతున్న రోడ్డు పనులు పరిశీలించి రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు .కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాంబాబు, ఆర్ అండ్‌బి డిఇ సురేష్ నాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.










