పంటకు ఆశించిన తెగులు గురించి వివరిస్తున్న ఎడి అల్తాఫ్ ఆలీఖాన్
ప్రజాశక్తి-హిందూపురం : రూరల్ మండలంలోని మణేసముద్రం గ్రామానికి చెందిన రైతు క్రిష్టప్ప పొలంలో సాగు చేసిన మొక్కజొన్న పంటను వ్యవసాయ శాఖ ఎడి అల్తాఫ్ ఆలీ ఖాన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మొక్కజొన్న పైరుకు వచ్చిన తెగులను గుర్తించి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతుకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీ రామ సుబ్బయ్య, ఎఇఒ శంకర్ తదితరులు పాల్గొన్నారు.










