ఫొటో : మాట్లాడుతున్న డిపిడి జి.శివనారాయణ
పంటల సస్యరక్షణపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : ఫాక్ట్ ఎరువుల కంపెనీ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆత్మ డిపిడి జి.శివనారాయణ పంటలలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి వివరించారు. పంటలలో సస్య రక్షణ గురించి, పంటల నుంచి వచ్చిన వ్యర్థాలతో వేస్ట్ డికంపోజర్ సహాయంతో చక్కటి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. ఫాక్ట్ కంపెనీ ఫాక్ట్ ఆర్గానిక్ ఎరువు పంటలకు ఎలా మేలు చేస్తుందో తెలియజేశారు. ఎడిఎ రాజ్ కుమార్ అగ్రికల్చర్ అధికారి రాధా శాస్త్రవేత్తలు డాక్టర్ సురేఖ, కె కిరణ్ కుమార్ రెడ్డి, ఎంఎఒ గీతాకుమారి, ఫాక్ట్ జోనల్ మేనేజర్ అమరనాథ్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ లోకనాథ్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.










