Jan 30,2023 21:42

పప్పుశనగ పంటను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : పంటలు నష్టపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సేంద్రీయ ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించాలని ఎడి కృష్ణమీనన్‌ సూచించారు. మండల పరిధిలోని కల్లుమర్రి గ్రామ సమీపంలో వరి, పప్పు సెనగ పంట పొలాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ పంట నమోదు కార్యక్రమం భాగంగా పంటలు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీర నరేష్‌, రైతు భరోసా కేంద్రం ఇన్చార్జులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.