న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాఖండ్ మినహా మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయం దిశగా దూసుకెళుతున్నారు. కతిమా నుండి పోటీ చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి వెనుకంజలో ఉన్నారు. ఇటు పంజాబ్‌లో ఆప్ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. అమృత్‌సర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్దు ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని ఏర్పాటు చేసి, బిజెపితో బరిలోకి దిగిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వెనుకంజలో ఉన్నారు. ఇటు గోవాలో బిజెపి ఆధిక్యంలో కొనసాగుతోంది. యుపిలో బిజెపి ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా.. కాంగ్రెస్ అసలు ఖాతా తెరవనేలేదు.










