- సర్వం సంసిద్ధం
చంఢఘీర్ : ఆదివారం జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మొత్తం 1,304 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. వీరిలో 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదళ్‌ాబిఎస్‌పి కూటమి, బిజెపిా పంజాబ్ లోక్ కాంగ్రెస్-శిరోమణి అకాళీదళ్ (సంక్‌యుక్త్) కూటమి పడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తంగా 2,14,99,804 మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 24,689 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 2,103 బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 16 జిల్లాల్లోని 59 నియోజవర్గాల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. యుపి మాజీ ముఖ్యంమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజవర్గం కూడా మూడో దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో ఉంది. హత్రాస్, ఫిరోజబాద్, ఇతాV్‌ా, కాస్‌గంజ్, మెయిన్‌పురి, ఫర్రూఖ్‌బాద్, కన్నౌజ్, ఇతావాV్‌ా, ఔరైయా, కన్పూర్ దెహత్, కన్పూర్‌నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమిర్‌పూర్, మహోబా జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 2.15 కోట్ల మంది ఓటర్లు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.










