Feb 19,2022 07:11

చంఢీఘర్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ నెల 20న ఒకే దశలో రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉండగా, ఇటీవల జరిగిన చంఢఘీర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్‌ మాజీ నేత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌తో జట్టు కట్టిన బిజెపి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తోంది. మార్చి 10న ఫలితాలు వ్లెలడికానున్నాయి.
ఏడాదికి ఉచితంగా 8 వంటగ్యాస్‌ సిలిండర్లు : కాంగ్రెస్‌
ప్రచారంలో చివరి రోజు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళా ఓటర్లపై ప్రధాన దష్టిపెట్టిన కాంగెస్‌, తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెలా రూ.1100 చొప్పున నగదు అందజేస్తామని, ప్రతి ఇంటికి ఏడాదికి 8 గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. చంఢఘీర్‌లోని కాంగ్రెస్‌ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. సిద్ధూ మాట్లాడుతూ కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తే మొట్టమొదటగా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని స హామీ ఇచ్చారు. గహిణులకు నెలకు రూ.1100 ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 8 వంట గ్యాస్‌ సిలిండర్లను ఉచితంగా అందిస్తామన్నారు. మాఫియా రాజ్‌ను అంతం చేస్తామని, మద్యం, ఇసుక మైనింగ్‌కు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సిక్కు ప్రముఖలతో ప్రధాని మోడీ భేటీ
పంజాబ్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన సిక్కు ప్రముఖులతో శుక్రవారం మోడీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మట్లాడుతూ 'భారత దేశం 1947లోనే ఆవిర్భంచలేదు. మన గురువులు ఎన్నో కష్టాలు పడ్డారు. ఎమెర్జెన్సీ కాలంలో ఎన్నో అణచివేతలకు గురయ్యాం. ఆ సమయంలో నేను అజ్ఞాతంలో ఉన్నాను. దాక్కోవడానికి నేను సిక్కు వేషం వేసుకునేవాడిని. పగ్డీ వేసుకునేవాడిని' అని మోడీ చెప్పారు. ఢిల్లీ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్‌ హర్మీత్‌ సింగ్‌ కల్కా, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా బల్బీర్‌ సింగగ్‌ జీ సిచెవాల్‌, మహంత్‌ కరంజిత్‌సింగ్‌, అమత్‌సర్‌లోని ముఖి డేరా బాబా, తారా సింగ్‌కు చెందిన సంత్‌ బాబా మేజర్‌ సింగ్‌ వా తదితరులు ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు.