పంజాబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఫలితాలు ఒక్కసారిగా తారుమారు అవుతున్నాయి. తొలుత కాంగ్రెస్ హవా సాగినప్పటికీ.. కొంత సమయం గడిచే సరికి .. ఆప్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 117 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం ఆప్ 84 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది. తొలుత ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ చీఫ్, అకాలీదళ్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దు, సుఖ్బీర్ సింగ్ బాదల్ వెనకుబడ్డారు. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ రెండు స్థానాల్లో బరిలోకి దిగగా... రెండింటిలోనూ వెనుకంజలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా వెనుకబడ్డారు.










