ధర్నాలో పాల్గొన్న నాయకులు
ప్రజాశక్తి -పుట్టపర్తి రూరల్ : పుట్టపర్తి పశువర్ధక శాఖ కార్యాలయం వద్ద పందుల పెంపక దారుల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జెడికి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మూడునెలలుగా క్లాసికల్ సైన్ ఫీవర్ అనే వ్యాధితో సోమందేపల్లి మండల కేంద్రంలో దాదాపు 3 వేల పందులకు పైగా చనిపోయాయని వాపోయారు. ఇంతవరకు తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెలేయ హామీ ఇచ్చినట్లు జెడి తెలిపారు.










