Jan 14,2023 20:04

అనురాధ, చంద్రమౌళి (ఫైల్‌ఫొటో)

రోడ్డు ప్రమాదంలో వధువు మృతి
ప్రజాశక్తి-లక్కిరెడ్డిపల్లి: రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి చెందడంతో పండుగ పూట రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శనివారం గువ్వలచెరువు ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనురాధ మృతి చెందగా ఆమె భర్త చంద్రమౌళికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే.. స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి వంక ప్రాంతంలో నివసిస్తున్న రామకృష్ణ కుమారుడుకి నెల రోజుల క్రితం కడపకు చెందిన అనురాధతో వివాహమైంది. శనివారం ఉదయం నూతన వధూవరులు సంక్రాంతి పండగకు ద్విచక్ర వాహనంలో కడపకు బయలుదేరారు. గువ్వలచెరువు ఘాటులో ద్విచక్రవానాన్ని లారీ ఢకొీంది. ఈ ప్రమాదంలో అనురాధ అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రమౌళికి కుడికాలు విరిగింది. స్థానికులు వెంటనే చంద్రమౌళిని వేలూరు ఆసుపత్రికి తరలించగా అనురాధను కడప రిమ్స్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనూరాధ మృతి, చంద్రమౌళికి గాయాలతో వారి రెండు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. సంఘటనపై రామాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.