Jan 14,2023 22:02

ఫొటో : పోలీసులకు పట్టుబడిన నిందితులు

పందెం రాయుళ్లు అరెస్ట్‌
ప్రజాశక్తి-సీతారామపురం : కోడిపందేల స్థావరంపై దాడి చేయగా ఎస్‌ఐ కె.కిషోర్‌బాబు 9 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఎస్‌ఐ కె.కిషోర్‌బాబు వివరాలు తెలియజేశారు. మండలంలోని అయ్యవారిపల్లి, వడ్లవారిపల్లి గ్రామాల సమీపంలోని అడవి ప్రాంతంలో తరచూ కోడిపందాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు చేశామని ఘటనా స్థలంలో కోడిపందేలు నిర్వహిస్తున్న వారిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
వారి వద్ద ఐదు కోళ్లు, ఆరు బైకులు, రూ.3350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. మండలంలో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అట్లు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.