Dec 30,2022 20:12

ఫొటో : సచివాలయంలో మాట్లాడుతున్న అధికారులు

పంచాయతీల అభివృద్ధికి కృషి
ప్రజాశక్తి-అల్లూరు : పంచాయతీల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపిడిఒ శ్రీదేవి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని పురిణి సచివాలయంలో సర్పంచ్‌ మైనంపాటి స్వాతి అధ్యక్షతన జిపిడిపి ఆర్గనైజేషన్‌పై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ పంచాయతీల్లో ప్రజలు భాగస్వాములై అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని పిలుపునిచ్చారు.
పారిశుధ్యం, ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి పెంచిన వీరేంద్ర, ఎంపిటిసి సయ్యద్‌ దిలీప్‌, వైసిపి నాయకులు తాండ్ర మల్లికార్జున తదితరులున్నారు.