ప్రజాశక్తి-వలేటివారిపాలెం :మండలంలోని నేకునాంపురంలో పంచాయతికి రూ.1.40 లక్షలు ఆదాయం సమకూరింది. గ్రామరలోని సర్వేనెంబరు 1246లోని 102.67 bకరాలలోని, సుమారు 7ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు సంబంధించిన భూమిలో bండు చిల్లకంపను కొట్టుకుని అమ్ముకునేందుకు శనివారం స్థానిక సచివాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ కొల్లూరి లక్ష్మమ్మ అధ్యక్షతన జరిగిన బహిరంగ వేలంలో నలుగురు ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొన్నారు. హెచ్చు పాటదారుడు కంచర్ల కోటయ్య రూ.1.40లక్షలకు పాడుకున్నారు. ఈ మేరకు పంచాయతి కార్యదర్శి bన్ శ్రీకళ ప్రకటించారు. ఈ నగదును పంచాయతి జనరల్ ఫండ్ ఖాతాకు జమ చేయనున్నట్లు ఆమె వివరించారు. పంచాయతి విస్తరణాధికారి సుమంత్, పోకూరు కార్యదర్శి bస్‌కె అబ్దుల్‌బారి, గ్రామస్తులు కొల్లూరి గోవిందయ్య, వార్డు సభ్యులు బ్రహ్మయ్య పాల్గొన్నారు.










