పంచాయతీ ఆదాయానికి గండి
ప్రజాశక్తి-ఉదయగిరి : పంచాయతీకి రూ.లక్షలు ఆదాయం వచ్చే చెట్లను రూ.5వేలకే అప్పజెప్పడం దుర్మార్గమని గన్నేపల్లి సర్పంచ్ నెల్లూరు వెంకటస్వామి నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక బిజెపి కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గన్నేపల్లి పంచాయతీ పరిధిలోని చెట్లు తొలగింపునకు పంచాయతీ అనుమతులు సర్పంచ్ తీర్మానం లేకుండా ఇరిగేషన్ అధికారులు తక్కువ నగదుకు ప్రభుత్వంకు ఇటు పంచాయతీకి ఆదాయం చూపకుండా ఓ వ్యక్తికి టెండర్ ప్రకటన ఇవ్వకుండా రూ.5వేలకు అప్పగించడం బాధాకరమన్నారు. 2800 నుండి 3000 వరకు బొగ్గు నిర్వాహకులు కొనుగోలు చేస్తుంటే లక్షలు విలువ చేసే వాటిని ఐదు వేలకు అప్పగించడం చోచనీయంగా ఉందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంచాయతీ అభివృద్ధికి సహకరించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని లేనిపక్షంలో గ్రామస్తులతో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు షాజహాన్, ఆవుల రోశయ్య, గ్రామస్తులు దారపునేని మాధవరావు తదితరులు పాల్గొన్నారు.










