Aug 09,2022 16:09

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో మంఖళవారం ఉదయం హఠ్మారణం చెందిన పల్లెక్రాంతి దినపత్రిక పెనుగంచిప్రోలు విలేకరి పంగులూరి వెంకట్రావు తండ్రి దశరధ రామయ్య(80) బౌతికకాయంకు పూలమాలలు వేసి పలువురు జర్నలిస్టులు నివాళులు అర్పించారు. దశరధ రామయ్యకు భార్య, ఇద్దరు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర నాయకులు పఠాన్ మీరాహుస్సెన్ ఖాన్, సీమాంధ్ర కెరటం ఎడిటర్ వి‌.రవిశేఖర్, జర్నలిస్టుల సంఘం నాయకులు ఆకుల వెంకట నారాయణ, కరీముల్లా, సైదాఖాన్, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొని వెంకట్రావుకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.