ఫొటో : డ్రిప్ పరికరాలను పరిశీలిస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు
పలుచోట్ల ఎపిఎంఐ డైరెక్టర్ పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలో పలుగ్రామాల్లో శనివారం ఎపిఎంఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు పర్యటించారు. మర్రిపాడు, పల్లవోలు గ్రామాల్లో రైతులు ఎపిఎంఐ సంస్థ ద్వారా కొనుగోలు చేసి తమ పంట పొలాల్లో అమర్చుకున్న సుధాకర్ డ్రిప్ పరికరాలను ఆయన తనిఖీ చేశారు. ఆయన రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. 2022-23 సంవత్సరానికి 2900 హెక్టార్లు లక్ష్యం కాగా జిల్లాలో ఇప్పటివరకు 3436.67 హెక్టార్లకు రైతులకు బిందు తుంపర్ల పరికరాలు అందించినట్లు తెలియజేశారు. డ్రిప్ పరికరాల వాడకంపై రైతుల అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఐఇ బాలాజీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.










