ఫొటో : మాట్లాడుతున్న జిల్లా డ్వామా ఎపిడి గాయత్రి
పలు గ్రామాలు ఎంపిక
ప్రజాశక్తి-ఉదయగిరి : అమత్ సరోవరం ప్రాజెక్టు కింద పలు గ్రామాలు ఎంపికైనట్లు జిల్లా డ్వామా ఎపిడి గాయత్రి తెలిపారు. శుక్రవారం ఉదయగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో సీతారాంపురం ఉదయగిరి మండలాల ఉపాధి హామీ సిబ్బందితో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం కింద ఆయా గ్రామాల్లో నీటి నిల్వలు వృద్ధి చేసేందుకు పలు గ్రామాలలో ఎంపిక చేశామన్నారు. సిబ్బంది వర్క్ రికార్డులు ఫీల్డ్ నేమ్ బోర్డులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.










