May 16,2023 21:52

ఫొటో : సిబ్బందితో ప్రతిజ్ఞ చేయిస్తున్న జెసి కూర్మానాథ్‌

ప్లాస్టిక్‌ను నిషేధించాలని జెసి ప్రతిజ్ఞ
ప్రజాశక్తి-ఉదయగిరి : పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను నిషేధించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కుర్మనాథ్‌ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్‌ 5న జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రజలకు శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
ముఖ్యంగా ప్లాస్టిక్‌ సంచులు వాడరాదని సహజ సిద్ధమైన నీటి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అటవిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందన్నారు. అనంతరం అటవీశాఖ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌సి గంగాధరం, ఏఈలు నరేష్‌, అనిల్‌ రెడ్డి, విఆర్‌ఒ వెంకటరమణ, నాయకులు మూలె సుబ్బారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.