May 20,2023 22:02

ఫొటో : ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సిబ్బంది

ప్లాస్టిక్‌ నివారణపై అవగాహణ
ప్రజాశక్తి-మర్రిపాడు : జిల్లా ఫారెస్ట్‌ అధికారి ఆదేశాల మేరకు మిషన్‌ లైఫ్‌లో భాగంగా స్థానిక గ్రామ సచివాలయంలో ప్లాస్టిక్‌ వాడకంపై అటవీ శాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి రవీంద్రబాబు ప్రజలకు అవగాహన కల్పించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజువారీ దినచర్యల్లో భాగంగా ప్రజలు ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. ఇంధనం వాడకాన్ని తగ్గించి, ఎలక్ట్రానిక్‌ వాహనాలను ఉపయోగిస్తూ పెట్రోల్‌ డీజిల్‌ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఇ
ళ్లలో వాడే విద్యుత్‌ను ఆదా చేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామ్మోహన్‌, ఉపసర్పంచ్‌ చెన్నపనాయుడు, పంచాయతీ కార్యదర్శి సికిందర్‌, ఎఫ్‌బిఒ మల్లికార్జున, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.