Jan 28,2023 20:15

ర్యాలీలో పాల్గోన్న ఎంయల్‌ఎ మహీధర్‌ రెడ్డి

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛత ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. పురపాలక సంఘం నుంచి పోస్ట్‌ ఆఫీస్‌ సెంటర్‌ మీదుగా షాపుల్లోకెళ్లి స్వచ్ఛత గురించి వివరించారు. ప్లాస్టిక్‌ నిషేధం, తడి చెత్త ,పొడి చెత్త గురించి వివరిస్తూ షాప్‌లో వాళ్లతో ఆప్యాయత పలకరిస్తూ ర్యాలీగా ఎంయల్‌ఎ మహీధర్‌ రెడ్డి, తహసిల్దార్‌ డి.సీతారామయ్య, కమిషనర్‌ ఎస్‌ మనోహర్‌, పోలీస్‌ సిబ్బంది, మున్సిపాలిటీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీ అనంతరము పురపాలక సంఘంలో విద్యార్థులకు ప్లాస్టిక్‌ రహిత వాటర్‌ (స్టీల్‌ బాటిల్స్‌)ను ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి అందజేశారు.