May 25,2023 21:08

పకడ్బందీగా రీసర్వే చేపట్టాలి : కలెక్టర్‌

రాయచోటి :ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని గ్రామ, మండల సర్వేయర్లకు కలెక్టర్‌ గిరీష ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లాలోని 450 మంది గ్రామ, మండల్‌ సర్వేయర్లకు కలెక్టర్‌ మెడికల్‌, స్టేషనరీ కిట్లను అందజేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రీ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. రీసర్వేకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తమ ద ష్టికి తీసుకురావాలని సూచించారు. రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్వేయర్లు, సర్వేశాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది సమిష్టిగా కషి చేయాలన్నారు. నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో పూర్తి అయిన గ్రామాలకు సర్వే రాళ్లను యుద్ధ ప్రాతిపదికన పాతాలన్నారు.అదే విదంగా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఎడి జయరాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంలో భాగంగా సర్వే అండ్‌ సెటిల్మెంట్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో రీసర్వే ప్రక్రియలో భాగంగా ధర్మామీటర్‌, సెలోవన్‌ యాంటీబయోటిక్‌ లోషన్‌, పారాసెట్మాల్‌ టాబ్లెట్‌, బ్యాండేజ్‌ మొదలకు 15 అంశాలు కలిపి మెడికల్‌ కిట్‌ తో పాటు ప్రధమ చికిత్స నిమిత్తం కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. అలాగే స్టేషనరీలో భాగంగా పేపర్స్‌, ఫైల్‌ పాడ్స్‌, పెన్స్‌ మొదలకు 24 అంశాలు కలిపి ఈ రెండు కిట్లను అందజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, గ్రామ, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.సిబ్బందికి సర్వే కిట్లు అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష