Mar 23,2023 22:45

సర్వే పనులు పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌, తదితరులు

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా పకడ్బందీగా రీ సర్వే చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్కోన్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా నిర్వహిస్తున్న సర్వేను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజతో కలసి ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పురపాలక సంఘ వ్యాప్తంగా డ్రోన్‌ సహాయంతో రీసర్వే చేపడుతున్నామన్నారు. సర్వే చేయడం వల్ల భూ వివాదాలను పరిష్కరించడానికి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.