Jun 05,2023 21:16

మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లాలో జలశక్తి అభియాన్‌ కార్యక్రమాలను విస్తతంగా అమలు చేసి నీటి వనరులను పెంపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంగా కషి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కానారెేన్స్‌ హాల్లో జిల్లాలో జరుగుతున్న జలశక్తి అభయాన్‌ కార్యక్రమాలు, జగనన్నకు చెబుతాం అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లాలో నీటి పొదుపు చర్యలను పటిష్టంగా అమలు పరచాలన్నారు. ఇందుకు సంబంధించి వర్షపు నీటి విలువ, సాంప్ర దాయ మరియు ఇతర నీటి వనరుల ట్యాంకులకు పునరుద్ధరణ, పునర్‌ వినియోగం, బోర్వెల్‌ రీఛార్జిలు, పరివాహక నీటి వనరుల అభివ ద్ధి, అటవీ ప్రాంతంలో నీటి సంరక్షణ కార్యక్రమాల అమలు తదితరాలపై సమీక్షించారు. ఆయా అంశాలకు సంబంధించి డ్వామా శాఖ పీడీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. జల వనరుల శాఖ ద్వారా జిల్లాలో ఉన్న చెరువులు దానికింద ఉన్న ఆయకట్టు, నీటి వినియోగము లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు, సప్లై చానల్స్‌, ఎంఐ ట్యాంక్స్‌ నిర్వహణ, భూగఠజేల శాఖ ద్వారా జిల్లాలో ఎన్నిచోట్ల ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు, అవి ఉన్నచోట గత ఏడాది మే నుంచి ఈ ఏడాది మే మాసం వరకు ఎన్ని ప్రాంతాలలో భూగఠజేలం పెరిగింది, ఎన్నిచోట్ల తగ్గింది తదితర అంశాల్లో నివేదికను సమర్పిం చాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్‌, సూక్ష్మ నీటి సాగు, వ్యవసాయ ఉద్యాన శాఖల ద్వారా నీటి నియోగ కార్యక్రమాలు సమీక్షించారు.అంతకు ముందుగా జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కారం పై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో అందిన అర్జీలను ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలన్నారు. రీఓపెన్‌ ఆర్జీల పై ప్రత్యేక ద ష్టి పెట్టాలి. అర్జీదారునికి సంతప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపకపోవడం వల్ల అర్జీలు వివాదం కావడం జరుగుతోందన్నారు. సదరు రీఓపెనైనా అర్జీలను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలను క్రోడికరిస్తూ అర్జీ సమస్యకు సరైన పరిష్కారాన్ని అందజేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఎఫ్‌ఓ వివేక్‌, డిఆర్‌ఓ సత్య నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.