పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్
ప్రజాశక్తి-అమరాపురం పకడ్బందీగా పశ్చిమ రాయలసీమ ఎన్నికల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ తెలిపారు. ఈమేరకు శనివారం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ డీఎస్పీ హుస్సేన్ పీరా, మడకశిర సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సురేష్‌బాబు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










