డైరెక్టర్ జనరల్ సునీత చేతులమీదుగా అవార్డును అందుకుంటున్న రవీంద్రరెడ్డి
ప్రజాశక్తి-వాల్మీకిపురం: స్థానిక పివిసి ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాతీయ హరిత పాఠశాల అవార్డుకు కైవసం చేసుకొంది. మంగళవారం ఎపి నేషనల్ గ్రీన్ కోర్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఇండియన్ హ్యాబిటట్ సెంటర్‌లో జరిగిన హరిత పాఠశాలల కార్యక్రమంలో జాతీయ ఉత్తమ హరిత పాఠశాల అవార్డును ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ సునీత నరైన్ చేతులమీదుగా వాల్మీకిపురం పివిసి ప్రభుత్వ పాఠశాల గ్రీన్ టీచర్ రవీంద్ర రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీసీ డైరెక్టర్ స్రవంతి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ నీలకంఠయ్య, జిల్లా కోఆర్డినేటర్ చక్రధర్ రాజులు స్థానిక పాఠశాల హెచ్‌ఎం అమరనాథ రెడ్డి, గ్రీన్ టీచర్ రవీంద్రరెడ్డిలను అభినందించారు.










