Dec 26,2022 22:37

మహిళకు నమస్కరిస్తున్న పరిటాల శ్రీరామ్‌

ధర్మవరంటౌన్‌ : ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన పింఛన్లు తొలగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ అన్నారు. పట్టణంలోని 35, 36వ వార్డులలో నిర్వహించిన ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరిటాలశ్రీరామ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక కుల్చడం, కోతలు విధించడమే పనిగా పెట్టుకుందన్నారు. పింఛను సొమ్ము పెంచుతున్నట్లే బయటకు కనిపిస్తున్నా నిబంధనల పేరుతో చాలా మందికి పింఛను తొలగిస్తున్నారని విమర్శించారు. అర్హుల పింఛన్లు తొలగిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతంకాటమయ్య, ఫణికుమార్‌, మహేష్‌ చౌదరి, నాగూరు ఉస్సేన్‌, భీమనేని ప్రసాద్‌నాయుడు, అంబటి సనత్‌, కొత్తపేట ఆది, రహీంబాషా, మాదనసుబ్బయ్య రాళ్లపల్లి పరిష్‌, గోసం శ్రీరాములు, బిల్లేషన, రాయపాటిశివ, కేశగాల శీన, కేతినేని రాజు, బాబా పకృద్దీన్‌, చోట వాసుదేవ సెలిమి శివరాం పాల్గొన్నారు.
మడకశిర : పట్టణంలోని నాలుగవ వార్డులో టిడిపి నాయకులు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా మైనారిటీ అధ్యక్షులు భక్తర్‌, టిడిపి పట్టణ అధ్యక్షులు మనోహర్‌, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య చౌదరి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి నాగరాజు, కౌన్సిలర్లు హనుమంతు, ఉమాశంకర్‌, శ్రీనివాసులు, శీనప్ప , మాజీ కౌన్సిలర్లు ఓబన్న తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం : మండలంలోని హేమావతి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా వైసిపికి చెందిన ఆనంద్‌, మంజునాథ్‌, చిక్కన్న, తిమ్మరాయప్ప, రవి తదితరులు టిడిపిలోకి చేరారు. వీరికి గుండుమల తిప్పేస్వామి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌ మూర్తి పార్టీ కండూవాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓంకార స్వామి, కృష్ణమూర్తి, చంద్రశేఖర్‌, నాగరాజు, గౌడరంగప్ప, సదాశివ,హేమావతి రామచంద్రప్పతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.