Dec 31,2022 20:12

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

పింఛన్లు రద్దు విరమించుకోవాలి
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం : వివిధ కారణాలతో ఇప్పటివరకు వస్తున్న సామాజిక పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో పింఛన్లు రద్దుపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పింఛన్‌ దారులకు అర్హులని వారందరికీ పింఛన్లు మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.2750 పింఛన్లు పెంచుతున్నట్లుగా ప్రకటించి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు వివిధ కారణాలతో పింఛన్లను కోత కోయడం దుర్మార్గమన్నారు.
సంవత్సరంలో ఎప్పుడు ఒక నెలలో 300 యూనిట్లు విద్యుత్‌ వాడారని, గృహ నిర్మాణాలు 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్నాయని, లేని పొలం ఉన్నట్టుగా చూపిస్తూ కొద్దిమందికి, రూపాయి ఆదాయం లేని వారికి కూడా ఆదాయం పన్నులు కడుతున్నట్లు రకరకాల కారణాలు చూపించి పింఛన్లను తగ్గించడాన్ని విరమించుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను కలుపుకొని ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఎంపిడిఒ నరసింహారావుకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గండవరపు శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తంబి రమణయ్య, కౌలు రైతు సంఘం మండల కార్యదర్శి గరికపాటి సురేష్‌, సిఐటియు మండల కార్యదర్శి మల్లికార్జున, నాయకులు ఖాదర్‌ బాషా, వెంకోజి, జానీ బాషా, బాలు కోటయ్య, దత్తళ్రీ కోటయ్య, ఆర్‌ మాల్యాద్రి, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.