ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : ప్రభుత్వం రద్దు చేసిన వృద్ధాప్య, వితంతు, విభిన్నప్రతిభావంతులు, ఒంటరి మహిళల తదితర సామాజిక భద్రత పింఛన్లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ దళిత మిత్ర సంఘం రాయలసీమ ఇన్‌ఛార్జి పెడబల్లి నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు కరకోట కిషోర్ బాబు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ అవరణంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని గత సంవ్సరంలో రెండు వేల మందికిపైగా పింఛన్లు తొలగించారని తెలిపారు. విద్యుత్ మీటర్ రీడింగ్ 300 యూనిట్లు దాటిన సామాజిక భద్రత పెన్షన్ రద్దు చేయడం చాలా బాధాకరమ్నఆ్నరు. న్యాయ సమ్మతం కానీ ఆంక్షలు భూతద్దంలో వెతికి ఎన్నో ఏళ్లుగా పింఛన్ పొందుతున్న వారు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిందేనా అని మండిపడ్డారు. పాదయాత్రలో చెప్పిన వాగ్దానం ఇదేనా అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి పింఛన్ రద్దు అనలేదని ఇప్పుడు ఇలా చేయడం సమంజసం కాదని ఏళ్ల తరబడి పెన్షన్ పొందుతున్న దివ్యాంగులు వెంటనే సదరన్ సర్టిఫికెట్లు తెస్తేనే పింఛన్ లేకపోతే రద్దు అవుతాయి అని నోటీసులు ఇస్తే ఎలాగని పేర్కొన్నారు. పది నిమిషాలు కూడా నిలబడని వికలాంగులు కార్యాలయాల చుట్టూ గంటలు తరబడి ఎలా తిరుగుతారని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వికాలంగుల సంఘం జిల్లా అధ్యక్షులు రెడ్డయ్య, జిల్లా అధ్యక్షులు నాగేశ్వర, పట్టణ ఉపాధ్యక్షులు లోకేష్ చిన్నమండెం మండల అధ్యక్షుడు నరసింహులు, ఉపాధ్యక్షులు శంకరయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కులయ్యప్ప, ప్రధాన కార్యదర్శి అది నారాయణ పాల్గొన్నారు.










