Jan 05,2023 20:19

పింఛన్లు అందజేస్తున్న కాకాణి

ప్రజాశక్తి -పొదలకూరు :  భారతదేశంలోనే పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయ ఆవరణంలో గురువారం ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ సమావేశంలో పాల్గొన్న ఆయన నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. పొదలకూరు సర్పంచ్‌ మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచ్‌ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, పొదలకూరు మండల ఉపాధ్యక్షులు వి చంద్రశేఖర్‌ రెడ్డి, సోమా అరుణ, ఎంపీటీసీ గుంటి శ్రీనివాసులు, షేక్‌ షాకీరా,తాసిల్దార్‌ ప్రసాద్‌, ఎంపీడీవో నగేష్‌ కుమారి, వైకాపా నాయకులు మూలి సతీష్‌ కుమార్‌ రెడ్డి, సోమా భాస్కర్‌, ఖాదర్‌ భాష పాల్గొన్నారు.