Nov 19,2023 22:37

ప్రజాశక్తి - పంగులూరు
చిన్నప్పటి నుంచే చదువుల పట్ల అవగాహన కలిగించి, పిల్లలను మంచి చదువు చదివించాలని, భవిష్యత్తును తీర్చిదిద్దాలని, తల్లిదండ్రులకు ముస్లిం పెద్దలు సూచించారు. స్థానిక నూర్ భాషా కాలనీలోనీ మసీదులో జరిగిన సమావేశంలో హైదరాబాదు నుండి వచ్చిన ముస్లిం పెద్దలు మాట్లాడారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేదీనని చదివేనని అన్నారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలని కోరారు. స్థానిక భాషలతో పాటు ఉర్దూలో కూడా పిల్లలను చదివించాలని కోరారు. ఉర్దూ చదువుకోవటం వలన లోకజ్ఞానంతో పాటు మసీదులో నమాజు చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ముస్లింల చరిత్ర పట్ల అవగాహన పెంచుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. కాలనీలో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలిసి అల్లాతత్వం గురించి, మసీదు, కురాన్, విశిష్టతలను వివరించి చెప్పారు. మసీదులో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. మసీదు మౌజన్ ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో హైదరాబాదు నుంచి వచ్చిన సులేమాన్, నావిద్, హరున్, నజీర్ అహ్మద్, ముహిసిన్ లతో పాటు ఆదుమ్ సాహెబ్ హస్సన్ సైదా వలి, వలి పాల్గొన్నారు.