పీడితుల పక్షాన కలం ఝళిపించిన 'కేతు'- అరసం జిల్లా అధ్యక్షులు ఆచార్య ఈశ్వరరెడ్డి
కడప అర్బన్ : పీడితుల పక్షాన తన కలాన్ని ఝళిపించిన మానవతావాది, అభ్యు దయ భావాలతో సాహిత్యాన్ని సామాజిక శాస్త్రాలతో అధ్యయనం చేసిన గొప్ప కథా రచయిత, విమర్శకుడు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అని అభ్యుదయ రచ యితల సంఘం (అరసం) కడపజిల్లా శాఖ అధ్యక్షులు ఆచార్య నల్లపరెడ్డి ఈశ్వర రెడ్డి అన్నారు. కేతు విశ్వనాథ రెడ్డి సంస్మరణ సభను అరసం కడపజిల్లా శాఖ, వైవీయూ సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంయుక్తంగా ఆదివారం ఉదయం బ్రౌన్‌శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించాయి. తొలుత వక్తలు, సాహితీవేత్తలు కేతు విశ్వనాథ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరసం కడపజిల్లా శాఖ అధ్యక్షులు ఆచార్య ఈశ్వర రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి తన చుట్టూ ఉన్న సమస్యలను, పుట్టి పెరిగిన ప్రాంత జీవితాన్ని కథలుగా మలచిన విశిష్ట రచయితని కీర్తించారు. ఆచార్య కేతు కథలను రేపటి తరానికి అందించి చదివించగలిగితే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, అదే మనం ఆయ నకిచ్చే ఘననివాళి అన్నారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ మాట్లాడుతూ ఆచార్య కేతుకు విశ్వవిద్యాలయం ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ తెలుగు శాఖకు మార్గదర్శనం చెయ్యడమేకాక గజ్జెల మల్లారెడ్డి అవార్డు ఎంపికలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితలసంఘం గౌరవాధ్యక్షులు పి.సంజీవమ్మ మాట్లాడుతూ తనకు ఆచార్య కేతుతో తనకు 1973 నుంచి పరిచయం ఉందని, 1974లో అరసం మొదటి కథాసంపుటాన్ని తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆయనను రాయలసీమకో, రాష్ట్రానికో పరిమితం చెయ్యకూడదని, ఆయన రచనలు అనేక జాతీయ భాషల్లోకి అనువదిత మయ్యాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర నాయకులు జి.ఓబులేసు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యాన్ని, మార్క్సిస్టు తాత్వికతను ఆయన ఒంటపట్టిం చుకొన్నారని తెలిపారు. ఆయన మననుంచి దూరం కావడం దిగ్భ్రాంతికర మన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనకేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సాహితీ రంగంలో విశ్వనాథ రెడ్డి తనకు మార్గదర్శ కులన్నారు. బ్రౌన్ గ్రంథాలయ అభివద్ధిలో ఆయన పాత్ర చిరస్మర ణీయమన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ విశ్వవి ద్యాలయం, అరసం ప్రతి ఏటా ఆయన పేరుతో సదస్సులు నిర్వహించి అవార్డులు ఇచ్చేలా చూడాలని కోరారు. ప్రముఖ కథారచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి, డాక్టర్ భూతపురి సుబ్రహ్మణ్య శర్మ, మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు డాక్టర్ తవ్వా వెంకటయ్య, బాసట స్వఛంద సేవా సంస్థ అధ్యక్షులు యం.బాలాజీ రావు, కొండూరు పిచ్చమ్మ వెంకట రాజు స్మారక సంస్థ అధ్యక్షులు లయన్ కొండూరు జనార్దన రాజు, కేతు విశ్వనాథరెడ్డితో ఉన్న అనుబంధాన్ని స్మరించు కున్నారు. అరసం కడపజిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తుమ్మలూరు సురేష్ బాబు స్వాగతం పలికారు. ఒడిస్సా రైలు దురెటన మతుల ఆత్మశాంతికి సభ మౌనం పాటించింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, కెస్కో సంస్థ వ్యవస్థాపకులు అలపర్తి పిచ్చయ్య చౌదరి, ప్రముఖ కథారచయిత పాలగిరి విశ్వప్రసాద్, జానమద్ది సాహితీ పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్, రాయలసీమ టూరిజం కల్చరల్ సొసైటీ చీప్ ప్యాట్రన్ లయన్ పోతుల వెంకట్రామిరెడ్డి, అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగా సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.రాజగోపాలరెడ్డి, డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి, హజర తయ్య, కుమారస్వామి రెడ్డి, డాక్టర్ వెల్లాల వేంకటేశ్వరాచారి అరసం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు గంగా సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.రాజగోపాలరెడ్డి, డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి, హజరతయ్య, కుమారస్వామి రెడ్డి, డాక్టర్ వెల్లాల వేంకటేశ్వరాచారి పాల్గొన్నారు.










