Jan 22,2023 20:38

పాఠశాల సౌకర్యాలను పరిశీలిస్తున్న అధికారులు

చిలమత్తూరు : ప్రధాన మంత్రి స్కూల్‌ ఫర్‌ రైసింగ్‌ ఇండియా కు చిలమత్తూరు మండలంలో ఎంపిక చేసిన మండల ప్రాథమిక పాఠశాల కొడికొండ, ఎపిఆర్‌ ఎస్‌ టేకులోడు పాఠశాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ ఉపసంచాలకులు(డిప్యూటీ డైరెక్టర్‌) సూర్యప్రకాశ్‌, ఎంఎఒ మహేంద్ర ఆదివారం పరిశీలించారు. ముఖ్యంగా పాఠశాలలో మౌలిక వసతుల ఆధారంగా అర్హతను బట్టి పిఎమ్‌ శ్రీకి పాఠశాలలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన పాఠశాలలో ఎలాంటి మౌలిక వసతులు, ప్రత్యేక అర్హతలు ఉన్నాయన్న విషయంపై డిప్యూటీ డైరెక్టర్‌ సూర్యప్రకాశ్‌ ఆరా తీశారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, తరగతుల గదులు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై ఆరా తీశారు. కొడికొండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు డిప్యూటీ డైరెక్టర్‌కి గులాబీతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ నాగరాజు,కొడికొండ హెడ్‌ మాస్టర్‌ అలీముల్లా, సిఆర్‌పి కృష్ణమూర్తి, ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : మండలం పరిధిలో ని పులమితి జిల్లా పరిషత్‌ పాఠశాల, కోడిపల్లి ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర పాఠశాలల ఉప సంచాలకులు సూర్య ప్రకాష్‌, మహేంద్ర ఆదివారం సందర్శించారు. ఈ పాఠశాలలు ప్రధాన మంత్రి శ్రీ పథకానికిు ఎంపిక కావడంతో ఆయా పాఠశాలల్లోని సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ నాగరాజు నాయక్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.