Aug 02,2022 22:53

ప్రజాశక్తి-విజయవాడ
ప్రధానమంత్రి అవాస యోజన గ్రామీణ్‌ లబ్దిదారులకు పొజిషన్‌ సర్టిఫికేట్లు మంజూరు, ఇ-రిజిస్ట్రేషన్ల లక్ష్యాల సాధనలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను హెచ్చరించారు. పియంఎవై గ్రామీణ్‌ రిజి స్ట్రేషన్‌లలో పేదలకు మంజూరైన గృహాల ఇ-రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ఆయన కార్యాలయం నుండి హౌసింగ్‌ అధికారులతో జూమ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 4,032 మంది లబ్దిదారులకు గాను ఇప్పటివరకు 2,112 మందికి మాత్రమే పొజిషన్‌ సర్టిఫికేట్లను అందించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయడం పట్ల జిల్లా కలెక్టర్‌ ఆసంతృప్తిని వ్యక్తం చేశారు. హౌసింగ్‌ ఏఇలు, విలేజ్‌ రెవెన్యూ అధికారులు, విలేజ్‌ సర్వే అధికారులు సంయుంక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిం చాలన్నారు. ఈ వారంతంలోపు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయని పక్షంలో మండల అసిస్టెంట్‌ ఇంజనీర్లను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జూమ్‌ కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, హౌసింగ్‌ పిడి ఏ. శ్రీదేవి, ఇఇ రవికాంత్‌, జిల్లాకు చెందిన డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.