Jan 30,2023 19:08

కేక్‌ కట్‌ చేస్తున్న పిడికిటి వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు సోమవారం జరిగాయి. సూర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఆవరణంలో వెంకటేశ్వర్లు ఆయన స్నేహితులు, సన్నిహితులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సిబ్బంది మధ్య కేక్‌ కట్‌ చేశారు. వెంకటేశ్వర్లకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాం, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు నాదెళ్ల కోటేశ్వరరావు, మహర్షి శ్రీను, చదలవాడ కొండయ్య, టిడిపి నాయకులు గుర్రం మాల్యాద్రి, షేక్‌ రఫీ పాల్గొన్నారు.