ప్రచారం చేస్తున్న నాయకులు
పిడిఎఫ్ ఎంఎల్‌సిల గెలుపు కోసం ప్రచారం
నెల్లూరు:స్థానిక 30 వ డివిజన్ కొత్తూరు అరుంధతి ప్రాంతంలో పిడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డికి, టీచర్స్ ఎంఎల్‌సి అభ్యర్థి పోక్కిరెడ్డి బాబురెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు, మాజీ సర్పంచి కండె శ్రీనివాసులు శాఖ కార్యదర్శి ఖయ్యూం, పొత్తూరు రమణయ్య, నరికే దశయ్యతదితరులు పాల్గొన్నారు. స్థానిక 27. వ డివిజన్ చంద్రమౌళి నగర్ ప్రాంతంలో సిఐటియు రూరల్ అధ్యక్షులు.కొండాప్రసాద్. పార్టీసభ్యులు కష్ణమూర్తి. సిఐటి యు కార్యకర్తలు వి. వెంకటేశ్వర్లు ,డి. రామకష్ణారెడ్డి. పి. వెంకట్ రెడ్డి. సిహెచ్ . మాలాద్రి. భవన నిర్మాణ కార్మిక సంఘంజిల్లా ఉపాధ్యక్షులు వై. రంగయ్య. తదితరులు పాల్గొన్నారు. 26వ డివిజన్ నందు సిపిఎం శాఖ ఆధ్వర్యంలో సి.పి.ఎం రూరల్ కమిటీ సభ్యులు దేవతాటి సంపత్ కుమార్, శాఖ కార్యదర్శి ఎస్‌కె.కాలేషా, పులిమి నరసింహారెడ్డి,ఎస్‌కె. చాంద్ భాషా, ఎస్‌ఆర్. అల్తాఫ్, సిహెచ్. కష్ణ, బి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ నగర్ ప్రాంతంలో సిపిఎం రూరల్ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు, వాసుదేవరావు, ప్రకాష్ రమేష్, షాహుల్, భాష, కరిముల్లా, రాంబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










