పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థులను గెలిపించండి
ప్రజాశక్తి-కావలి : స్థానిక 22 వార్డు వెంగళరావు నగర్‌లో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పిడిఎఫ్ పట్టభద్రుల ఎంఎల్‌సి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీగడ వెంకటేశ్వర రెడ్డిని గెలిపించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల ఓటర్లను కలిసి మీగడ వెంకటేశ్వరరెడ్డికి ఓటువేసి గెలిపించాలని కోరారు. అనంతరం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై, నిరుద్యోగుల కోసం ప్రజా సమస్యలపై ఉద్యోగ భద్రతపై, కనీస వేతనాలు, ఇంకా ప్రజా కార్మిక ఉద్యోగులు నిరుద్యోగులకు సమస్యలపై మాట్లాడే పిడిఎఫ్ తరఫున పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మీగడ వెంకటేశ్వర్ల రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.కిష్టయ్య, కె.చెన్నయ్య, పి.పెంచలనరసింహం, తదితరులు పాల్గొన్నారు.










